కొండపల్లి క్రాంతి హై స్కూల్ లో సైన్స్ ఎక్స్ పో..

కొండపల్లి క్రాంతి హై స్కూల్ లో సైన్స్ ఎక్స్ పో..
క్రాంతి హై స్కూల్ కరస్పాండెంట్ మురళీమోహన్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎక్స్ పోలు దోహదం చేస్తాయని క్రాంతి హైస్కూల్ కరస్పాండెంట్ వెనిగళ్ళ మురళీమోహన్ అన్నారు. కొండపల్లి క్రాంతి హై స్కూల్ లో ఒకటో తరగతి నుంచి 9 వ తరగతి వరకు విద్యార్థులు సైన్స్ ఎక్స్ పో నిర్వహించారు. దీనిని కరస్పాండెంట్ మురళీమోహన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థుల సబ్జెక్టుకు సంబంధించిన ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ లోని పలు అంశాలను ఎంచుకొని వాటిని ప్రాజెక్టు రూపంలో తయారు చేసే ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఇలాంటి సైన్స్ ఎక్స్ పోలు పాఠశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థులు తరగతుల్లో నేర్చుకున్న సిద్ధాంతాలను ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. బట్టీపట్టే విధానంతో కాకుండా నైపుణ్యంతో ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వలన వారికి మాత్రమే కాకుండా మిగిలిన విద్యార్థులందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ఎప్పటికీ ఆ సిద్ధాంతాలు గుర్తుండేలా సబ్జెక్టు అర్థమవుతుందన్నారు. ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపడతాయని చెప్పారు. ఈ ఏడాది ప్రైమరీ తరగతుల విద్యార్థుల మాత్రమే కాకుండా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
