మహా కుంభాభిషేకం ఉత్సవాలు..

మహా కుంభాభిషేకం ఉత్సవాలు..
డ్రోన్లతో పర్యవేక్షిస్తూ విఎంసి వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి..
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : మహా కుంభాభిషేకం ఉత్సవాలకు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ విఎంసి వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా వినాయకుని గుడి, కెనాల్ రోడ్, సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, పున్నమి ఘాట్, భవాని ఘాట్, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు, విజయవాడ నగరపాలక సంస్థ కల్పించే వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా నిరంతరం స్టాక్ పాయింట్ల నుండి త్రాగునీటి పాయింట్లకు సరఫరా అయ్యేటట్టు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని వాడుక నీరు నిరంతరం అందుబాటులో ఉండాలని ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతులు కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం డ్రోన్లతో అధికారులు పర్యవేక్షిస్తూ పారిశుద్ధ నిర్వహణలో కానీ విజయవాడ నగరపాలక సంస్థ కల్పించే వసతుల్లో కానీ ఏమాత్రం లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విఎంసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్టాక్ పాయింట్ లలో ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుని, దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని, అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
