ఐఏఎస్ కార్తికేయను విధులు నుంచి తప్పించాలి..

ఐఏఎస్ కార్తికేయను విధులు నుంచి తప్పించాలి..
మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ డిమాండ్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీని మరియు శాంతి భద్రతల పరిరక్షణలో ముందస్తులో ఉన్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ను గన్నవరం ఎయిర్పోర్ట్ లో అవమానించిన ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ ఐఏఎస్ ను తక్షణమే విజయం నుంచి తప్పించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్తికేయ చర్యలను బాలాజీ తీవ్రంగా ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బాలాజీ సూచించారు. జిల్లా కలెక్టర్ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడే హక్కు కార్తికేయకు లేదని బాలాజీ అన్నారు.
జిల్లా కలెక్టర్ కొరియర్ లో బూట్లు పంపడం కార్తికేయ ఆహంభావానికి పరాకాష్ట అని బాలాజీ అన్నారు. ప్రతిరోజు అన్ని రంగాలలో జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నిజాయితీ అధికారి డీకే బాలాజీ అని బాలాజీ అన్నారు. జిల్లా ఎస్పీగా పదవి స్వీకరించిన నాటి నుండి జిల్లాలో శాంతి పద్ధతులు కాపాడుతూ ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ను అవమానించడం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ప్రశ్నించారు. కార్తికేయ అసభ్యకర పదజాలం జిల్లా ప్రజలను అవమానించినట్లు నని బాలాజీ అన్నారు తక్షణమే కార్తికేయ బేషరతుగా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కు క్షమాపణలు చెప్పాలని, కార్తికేయను పదవి నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను బాలాజీ డిమాండ్ చేశారు.
