ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చండి..

ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చండి..

పామర్రు ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసిరిన కైలే

పామర్రు, ఆంధ్రప్రభ : మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఎలక్షన్ ముందు 3సెంటు భూమి ఇస్తా అన్నారో ప్రజలకు ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. వచ్చే సోమవారం ధర్నాలో మీ ఇసుక దండలు మీరు చేసే దోపిడీలు బయట పెడతామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు ఈ ఇల్లు స్థలాలు డ్రామా మొదలు పెట్టాడని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాను విమర్శించారు. ఎవర్నో తీసుకొచ్చి మాయమాటలు చెప్పించడం కాదు నీకు దమ్ముంటే నిరూపించాలన్నారు. నీకు లాగా ఇసుకలో వాటా తీసుకోలేదని, రేషన్ బియ్యంలో వాట తీసుకోలేదని, ఉద్యోగాల్లో వాటా తీసుకోలేదన్నారు. ఇంత వరకు నా మీద అవినీతి మచ్చ కూడా లేదని దమ్ముంటే నువ్వు నిరూపించుకో నీకు ఛాలెంజ్ చేస్తున్నా అని తెలియజేశారు.

Leave a Reply