దేవరగట్టులో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : కర్నూలు (Kurnool) జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో కర్రల సంబరంలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ విషాదంలో మృతుల వివరాలను ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఆలూరు మండలం (Alur Mandal) అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన కోసిగి నాగరాజు, కర్ణాటకకు చెందిన బసవరాజును గుర్తించారు.
ఈ దుర్ఘటనలో మృతి చెందిన మరో వ్యక్తి వివరాలు తెలియలేదు. మృత్తి చెందిన వ్యక్తి ఎడమ చేతిపై ఎన్.బి.కె అనే పచ్చబొట్టు (tattoo) ఉందని పోలీసులు వెల్లడించారు. వీటిని ఆధారంగా తీసుకుని బంధువులు, మిత్రులు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గుర్తించిన వారు వెంటనే హొళగుంద ఎస్ఐ 91211 01161 లేదా ఆలూరు సీఐ 91211 01157 నంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.


