Rohit Sharma | రో‘హిట్’ మ్యాన్ ఖాతాలో మరో రికార్డు !
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ధనాధన్ ఫోర్లతో 41 పరుగులు నమోదు చేసిన హిట్ మ్యాన్.. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్) ఇప్పటికే ఈ ఘనత సాధించాడు. కాగా, బంగ్లాదేశ్‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులు నమోదు చేసిన రోహిత్… 261 ఇన్నింగ్స్‌లలో 11029 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
- విరాట్ కోహ్లీ (భారత్) – 222 ఇన్నింగ్స్
- రోహిత్ శర్మ (భారత్) – 261 ఇన్నింగ్స్
- సచిన్ టెందూల్కర్ (భారత్) – 276 ఇన్నింగ్స్
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 286 ఇన్నింగ్స్
- సౌరభ్ గంగూలీ (భారత్) – 288 ఇన్నింగ్స్
- జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 293 ఇన్నింగ్స్
భారత క్రికెట్‌లో నాలుగో వ్యక్తిగా రికార్డు
11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ (13,963), సౌరవ్ గంగూలీ (11,363) మాత్రమే ఈ రికార్డును సాధించారు.