హైదరాబాద్ మెట్రో మరోసారి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. అత్యవసర గుండె మార్పిడి కోసం హైదరాబాద్ మెట్రో రైలు ఈ ప్రత్యేక గ్రీన్ ఛానల్‌ను ఈరోజు (శుక్రవారం – మార్చి 7) రాత్రి 9.16 గంటలకు ఏర్పాటు చేసింది.
ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్స్ నుండి… ఒక దాత గుండెను మెట్రో ద్వారా సికింద్రాబాద్‌లోని రసూల్‌పురా కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
రెండు ఆసుపత్రుల మధ్య దూరం 13 కిలోమీటర్లు… ట్రాఫిక్‌లో గుండెను రోడ్డుపైకి తీసుకెళ్లడానికి గంటకు పైగా పట్టవచ్చు. అయితే, వైద్య బృందం మెట్రోలో కేవలం 12 నిమిషాల్లో ఆ దూరాన్ని అధిగమించింది.