Prayagraj | మహాకుంభ మేళాలో మరో అగ్నిప్రమాదం..
ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి. జనవరి 19, జనవరి 30వ తేదీల్లో మంటలు చెలరేగగా… తాజాగా ఈరోజు ఆదివారం సెక్టార్-23 ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఇప్పటికే చాలా టెంట్లు దగ్ధమవ్వగా.. సీనియర్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.