Fire accident: మహాకుంభమేళాలో మరో అగ్నిప్రమాదం

యూపీలో జరుగుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలోని ఓ గుడారంలో మంటలు చెలరేగాయి. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సర్వేశ్ కుమార్ జాతీయ మీడియాకు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం సెక్టార్ -22 లో గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 13నుంచి కొనసాగుతున్న మహాకుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనున్నది. గురువారం నాటికి 39 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *