తిరుపతిలో మరో కేంద్ర సంస్థ
- ఎస్వీయూలో సాంకేతిక శిక్షణకు ముందడుగు
- ఎంపీ గురుమూర్తి హాజరు
తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ : తిరుపతిలో నేషనల్ ఎలక్ట్రానిక్స్(National Electronics) అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) కేంద్రం ప్రారంభంతో తిరుపతిలో సాంకేతిక శిక్షణలో సరికొత్త మలుపు అని ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నైలెట్ కేంద్రాన్నిగురువారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.
ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ కేంద్రం స్థాపన కోసం ఎంపీ గురుమూర్తి నిరంతరం కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
కేంద్ర మంత్రికి ధన్యవాదాలు
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి(MP Gurumurthy) మాట్లాడుతూ.. నైలెట్ ఆవిర్భావం తిరుపతిలో సాంకేతిక శిక్షణకు కొత్త మలుపు అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. నైలెట్(Nilet)లో ఐటీ సంబంధిత శిక్షణతో పాటు వెబ్ డిజైనింగ్(Web Designing), పీసీ హార్డ్‌వేర్, నెట్ వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి షార్ట్‌టర్మ్ కోర్సులు అందించనున్నారు.
అదనంగా, ఎంబీడెడ్ సిస్టమ్(Embedded System) డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సెమికండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ శిక్షణ లభించనుంది. నైలెట్ కేంద్రం వల్ల తిరుపతి యువతకు దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.