విద్యార్థులు గురువులను పూజించాలి… గౌరవించాలి

విద్యార్థులు గురువులను పూజించాలి… గౌరవించాలి

విజ్ఞాన్ స్కూల్ నాలుగో వార్షికోత్సవ కార్యక్రమంలో…
వైరా మున్సిపాలిటీ ఛైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ…

వైరా, ఆంధ్రప్రభ : గురువులను పూజించాలి… గౌరవించాలని …విద్యార్థుల రేపటి భవిష్యత్తుకు అదే పునాది వేస్తుందని వైరా మున్సిపాలిటీ ఛైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ పేర్కొన్నారు…వైరా మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్ రోడ్డు నందు విజ్ఞాన్ స్కూల్ నాలుగో సంవత్సరం వార్షికోత్సవం వైరాలోని పరుచూరి గార్డెన్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగావైరా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ , వైస్ చైర్మన్ కట్ల సంతోష్ తో కలిసి జ్యోతి ప్రజ్వల వెలిగించారు.అనంతరం సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గురువుల పూజించడం నేర్చుకోవాలి తల్లిదండ్రులను గౌరవించాలి, సమాజం పట్ల బాధ్యతగా వహిస్తే భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, అవుతారని అన్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి పది పాసైన అయిన ఉత్తీరీలులైన విద్యార్థులు డ్రగ్స్,మత్తు పదార్థాలకు బానిసల అవుతున్నారు.

కావున తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల స్కూల్ స్థాపించిన జయప్రకాష్ మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply