Anniversary | అమరజీవికి ఘన నివాళి

Anniversary | అమరజీవికి ఘన నివాళి
Anniversary | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రత్యేక అస్తిత్వాన్ని సమున్నతం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహా త్యాగి, అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆత్మబలిదానం కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడమే కాదు, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు.
తెలుగు ప్రజల అస్తిత్వం కోసం 58 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరకు ప్రాణాలను త్యాగం చేసిన ఆయన నిబద్ధత అందరికీ శిరోధార్యం అని అన్నారు. కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, రాజశేఖర స్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రామమోహన రావు, పార్టీ నాయకులు బండే రాఘవ, మండలి రామమోహనరావు, దాసినేని శ్రీనివాసరావు, మెగవత్తు గోపి, కంచర్ల ఆనంద్, గుంటూరు వినయ్, నాగిడి రాంబాబు, చెన్ను బాబూరావు, కొండవీటి గోవిందు, ముళ్లపూడి శ్రీనివాసరావు, కొల్లూరి ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.
