Anil ravipudi | అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి

Anil ravipudi | అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి
Anil ravipudi |వెంకీతో మల్టీస్టారర్ ప్లాన్?
ఫహాద్ ఫాజిల్ బదులు కార్తి?
ఉగాదికి గ్రాండ్ లాంచ్?
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హిట్ మిషన్ అనిల్ రావిపూడి నెక్ట్స్ ఏంటి అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ సినిమా కథ ఇదే అంటూ వార్తలు రావడం.. ఆ వార్తలను అనిల్ రావిపూడి.. తనదైన్ స్టైల్ లో ఖండించడం కూడా జరిగింది. లేటెస్ట్ గా ఈ క్రేజీ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫాజిల్ అనుకుంటే.. కార్తి వచ్చాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా..?
Anil ravipudi | వెంకీతో కార్తి..

అనిల్ రావిపూడి.. వెంకటేష్ తో సినిమా చేయడం అనేది కన్ ఫర్మ్. అయితే.. స్టోరీ లైన్ ఫైనల్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో కథ ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. ఈ సినిమాలో వెంకీతో పాటు మరో హీరో కూడా ఉంటాడట. ఆ పాత్ర కోసం మలయాళ యాక్టర్ ఫహిద్ ఫాజిల్ ను తీసుకోవాలని.. ఆయనతో కామెడీ చేయించాలని అనిల్ అనుకున్నట్టుగా గుసగుసలు వినిపించాయి. ఇది నిజమో కాదో క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కార్తి పేరు గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై సినీ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.
Anil ravipudi | ఉగాదికి క్రేజీ మూవీ ప్రారంభం..

కార్తి తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కింగ్ నాగార్జునతో కలిసి ఊపిరి అనే సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కార్తిని తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది. ఆతర్వాత కార్తి తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయలేదు. ఇప్పుడు తెలుగులో స్ట్రైయిట్ మూవీస్ చేసేందుకు మరింతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి సినిమాలో ఆఫర్ రావడంతో వెంటనే కార్తి ఓకే చేశాడట. ఈ సినిమాలో నటిస్తే కార్తికి మంచి ఛేంజ్ అవుతుంది.. ఉగాదికి ఈ సినిమాని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా వెంకీతో పాటు కార్తి కూడా కలిస్తే.. ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరగడం ఖాయం.
