ANIL | హామీలన్నీ నెరవేరుస్తా..

ANIL | హామీలన్నీ నెరవేరుస్తా..

  • గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
  • కాంగ్రెస్ అభ్యర్థి తుంరం మాన్కు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు జువ్వాజీ అనిల్ గౌడ్

ANIL | తిర్యాణి, ఆంధ్రప్రభ : కన్నెపల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా తుంరం మాన్కును గెలిపిస్తే హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు జువ్వాజీ అనిల్ గౌడ్ తెలిపారు. శుక్రవారం కన్నెపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పది ప్రధాన హామీలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కన్నెపల్లి గెలిపించిన ఓటర్లందరి ఇంటి పన్ను ఐదు సంవత్సరాల పాటు తామే భరిస్తామని అనిల్ గౌడ్ స్పష్టం చేశారు. మొలలగూడ, బోడగుట్ట గ్రామాలకి వెళ్ళె దారి బి.టి రోడ్డు నిర్మిస్తామన్నారు. గ్రామంలో మురికి కాలువలు (డ్రైనేజ్) నిర్మాణం, ప్రతి ఇంటికి మంచి నీటి సౌకర్యాన్ని అందిస్తామని, కన్నెపల్లి నుండి యస్.సి కాల‌నీకి వెళ్లే వాగు ఐఠాన్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతన‌న్నారు. గ్రామంలో వీధీ దీపాలు లైట్లు ఏర్పాటు సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని, కన్నెపల్లి గ్రామపంచాయితీని మోడల్ గ్రామపంచాయితీగా తీర్చిదిద్దుతానన్నారు.

బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తుంరం మాన్కును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిత్తారి సాగర్, మండలం సీనియర్ నాయకులు పెరుమాండ్ల వెంకటేశం గౌడ్, కన్నెపల్లి గ్రామ పటేల్ వెడ్మ శంకర్, వెడ్మ మొగిలి, కామెర శంకర్, మహేష్, వెడ్మ లచ్చు, రాయీసిడం సోనేరావు, చుంచు సుషన్, తొంగల సతీష్, తోగరి కుమార్, ఆత్రం హనుమంతరావు, సిడంజంగు, బోర్లకుంట శంకర్, ఇప్ప సంజీవ్, సారయ్య, ఆయా గ్రామాల గ్రామ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply