Andhraprabha | ఆంధ్రప్రభ కథనానికి స్పందన

Andhraprabha | ఆంధ్రప్రభ కథనానికి స్పందన

  • ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు

Andhraprabha | తాడ్వాయి, ఆంధ్రప్రభ : మూలమలుపులలో ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రభ శీర్షికలో వచ్చిన కథనానికి స్పందించి ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపై చిట్యాల సర్పంచ్ రంజిత్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేష్, గ్రామ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి స్పందించి మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

మూలమలుపులలో వాహనదారులకు ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో మానవతా దృక్పథంతో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించినందుకు, ప్రజలకు ఉపయోగపడే కథనాలను వెలికి తీస్తున్న ఆంధ్రప్రభకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయడం పట్ల చిట్యాల గ్రామ ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply