కౌన్ ..బనేగా.. ప్రజాపతి
కౌన్ ..బనేగా.. ప్రజాపతి
(ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ )
హోరాహోరీగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ,, సహా దేశ వ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కాదు… జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఒడిషా, జార్ఖండ్, మిజోరాం, పంజాబ్ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలపైనే జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా.. కౌన్ బనేగా బీహారీ సీఎం అనే అంశంపైనే నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. ఈ సారి ప్రధాన సీఎం అభ్యర్థిగా జేడూయూ నేత నితీశ్ కుమార్ లేరు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు? అనే అంశంపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ రంగంలో ఉన్నారు. తమ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, సీఎం తానే నని తేజస్వీ యాదవ్ ఇప్పటికే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. తన వ్యూహరచనతో దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీల దోసెట్లో అధికారాన్ని అందించిన ఎలక్షన్ ఈవెంట్ మేనేజర్ ప్రశాంత్ కిశోర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో.. ఆయన స్థితి గతిపై చర్చ జరుగుతోంది. ఆయన ప్లానింగ్ లో అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలూ.. ఆయనను దూరం చేసుకున్న స్థితిలో.. తన సొంత ఇలాఖాలో తన సత్తా నిరూపించి.. మళ్లీ దేశంలో తనను మించిన ఈవెంట్ మేనేజర్ లేరని నిరూపించుకునే ప్రయత్నం చేసిన ప్రశాంత్ కిషోర్ .. భవితవ్యం ఏమిటో కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ తన సీటును నిలబెట్టుకుందా? కాంగ్రెస్ కొల్లగొట్టిందా? మధ్య బీజేపీ ఉనికి పుంజుకుందా? మరి క్షణాల్లో తేలుతుంది. క్షణ క్షణం .. ఎప్పటి కప్పుడు ప్రభన్యూస్ .కామ్ లో ఎన్నికల ఫలితాల సమాచారం తెలుసుకోండి.. మరిన్ని విశ్లేషణాత్మక స్టోరీలు చదవండి ..

