అపూర్వ ఆతిథ్యమిచ్చి ఆంధ్ర టాక్సీ..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : సురక్షితమైన, సౌకర్యవంతంగా, కారు చౌకలో పూర్తి భద్రత నడుమ నిత్యనిగా పర్యవేక్షణలో అందరికీ ఆతిథ్యమిచ్చే ఆంధ్ర టాక్సీ అందుబాటులోకి వచ్చింది. పర్యాటకులను.. పర్యావరణ ప్రేమికులను ఆకర్షించేందుకు అన్ని సేవలను ప్రత్యేక ప్యాకేజీలతో సుశిక్షితులైన ఔత్సాహిక గైడ్ల లతో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ తీసుకున్న చొరవ దేశానికే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా నిలుస్తోంది.

ఇప్పటివరకు కార్పొరేట్ కంపెనీ ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆటోలు టాక్సీలు క్యాబ్ లను ఇకనుండి ప్రభుత్వ ఆధీనంలో ఒక పోర్టల్ యాప్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ట్రైన్ రన్ గా నడుస్తున్న ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్న దేవాలయాలు పర్యాటక ప్రాంతాలను అత్యంత సురక్షితంగా సౌకర్యవంతంగా భద్రత నడుమ వీక్షించే అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి మోసాలకు తావు లేకుండా సందర్శకులకు సౌకర్యవంతంగా తర్ఫీదు పొందిన గైడ్ల సహకారంతో ఖచ్చితమైన మధురానుభూతి కలిగే విధంగా ఆంధ్ర టాక్సీని రూపొందించారు.

పర్యాటకంలో కీలక అడుగు…

రాజకీయ, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా కనిపిస్తున్న అమరావతి పర్యాటకంలో ఆంధ్ర టాక్సీ ద్వారా కీలక అడుగు పడింది. అన్ని రంగాలలో అన్నింటిలోనూ పోటీ పడుతున్న ఆంధ్ర ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించే దిశగా ప్రభుత్వమే చర్యలు ప్రారంభించి ఇటు పర్యాటకులకు అటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్ర టాక్సీ రూపొందించబడింది.

ఏపీ క్యాపిటల్ అమరావతిని వీక్షించేందుకు వచ్చే పర్యాటకులను మరింత ఆకర్షించే క్రమంలో కారు చౌకగా భద్రతగా రవాణా సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా ఆంధ్ర టాక్సీని రూపొందించారు. టాక్సీ ల విషయంలో నిత్యం జరుగుతున్న గొడవలు కొట్లాటలు నేపథ్యంలో అందరి మోసాలను చెప్పి పెట్టే విధంగా సౌకర్యవంతంగా భద్రత పరంగా అన్ని చర్యలను ఖచ్చితమైన సమాచారంతో రూపొందించారు.

అందరికీ అందుబాటులో ప్యాకేజీలు…

వ్యక్తిగత పనులతో పాటు పర్యాటకంగా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే వారికోసం ఒకటి నుండి ఐదు రోజులపాటు వివిధ ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రత్యేక ప్యాకేజీలను ఆంధ్ర టాక్సీ ద్వారా జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ అందుబాటులో ఉంచారు.

ముఖ్యంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కనకదుర్గమ్మ వారి ఆలయం బెరంపార్క్ కొండపల్లి కోట పవిత్ర సంఘం భవాని ఐలాండ్ బాపూజీ మ్యూజియం గాంధీ హిల్ తో పాటు ఇతర ప్రాంతాలను పర్యటించి అక్కడి అనుభూతులను పర్యాటకులకు అందించే విధంగా గైడ్లను సైతం పూర్తి తర్ఫీదు తో సిద్ధం చేశారు. జిల్లాకు వచ్చే పర్యటకులందరికీ మధురానుభూతులు మిగిలేలా ఆహ్లాదకర ఆతిథ్యం అందించడంతోపాటు జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా యాప్ లో ఈ సేవలను అందుబాటులో ఉంచారు..

నిత్య పర్యవేక్షణ నిరంతర నిఘా…

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ రూపొందించిన ఈ ఆంధ్ర టాక్సీ యాప్ అందరికీ అందుబాటులో ఉంచారు. ఆంధ్ర టాక్సీ పోర్టల్ యాప్ లో క్యాబ్లో ఆటోలను వాట్సప్ ఫోన్ కాల్ క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసే కొన్ని అవకాశాన్ని కల్పించారు. ఏ ప్రాంతం నుంచి వాహనం కావాలో యాప్లో నమోదు చేస్తే అక్కడ స్థానికంగా రిజిస్టర్ అయి ఉన్న డ్రైవర్ వివరాలతో సహా అన్ని కనిపించే విధంగా రవాణా శాఖ అధికారుల పర్యవేక్షించి ఫిట్నెస్ ఉన్న వారికే అనుమతినే అందజేస్తారు.

మరి ముఖ్యంగా మహిళల భద్రత దృష్ట్యా వాహనాల డేటా బుకింగ్ సమాచారం ట్రాకింగ్ వంటివన్నీ స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించేలా యాప్ ను రూపొందించారు. ఈ యాప్ లో నమోదైన వాహనాల సమాచారం మొత్తం సెంట్రలైజ్డ్ ద్వారా నమోదయి ఉండడం ప్రయాణికుల వ్యక్తిగత డేటా కూడా సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు రవాణా హోటల్ గదులు అన్ని అందుబాటులో ఉంచే ఈ ఆంధ్ర టాక్సీలో నచ్చిన ప్యాకేజీని పర్యాటకుడు ఎంచుకునే సదుపాయాన్ని కల్పించారు.

Leave a Reply