Srisailam Temple: శ్రీశైలం ఆలయంలో ఉద్యోగి చేతివాటం

విధుల నుంచి తొలగించిన కార్యనిర్మాణాధికారి…


నంద్యాల బ్యూరో, జులై 16 (ఆంధ్రప్రభ) : జ్యోతిర్లింగాలలో ఒక్కటైన నంద్యాల జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam) లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాధర్ హుండీ సొమ్మును తస్కరిస్తూ పట్టుబడిన వైనం చోటుచేసుకుంది. కార్యనిర్వాణాధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) బుధవారం తెలిపిన వివరాల మేరకు… బుధవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో కార్యనిర్వాణాధికారి సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఈ పరిశీలనలో ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాధర్ దేవాలయంలోని రత్నగర్భ గణపతి స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్న క్లాత్ హుండీ వద్ద అనుమానాస్పదంగా ఉండటాన్ని నిర్వాహణాధికారి గుర్తించారు. వెంటనే వెళ్లి ఆకస్మిక తనిఖీ (Sudden inspection) చేయాలని భద్రతా విభాగం పర్యవేక్షకులను ఇన్చార్జి ముఖ్య భద్రతాధికారి అయిన మల్లికార్జున (Mallikarjuna) ను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు హెచ్ విద్యాధర నుంచి హుండీ నగదును సత్కరించిన సొమ్ము రూ.24,220లను స్వాధీనం చేసుకున్నారు. పరిపాలన చర్యల్లో భాగంగా సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా విద్యాధర్ ను విధుల నుంచి తొలగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కార్యనిర్మాణాధికారి మాట్లాడుతూ… భద్రత చ‌ర్య‌ల్లో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్ర పరిధిలో వివిధ ప్రదేశాల్లో మొత్తం 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిపాలన పరిశీలనలో భాగంగా ప్రతిరోజు కార్యనిర్వాహణాధికారి పలుసార్లు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించటం జరుగుతుందన్నారు. కనుగుణంగా సంబంధిత విభాగాలకు కార్యనిర్వాణాధికారి ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్స్ క్యూలైన్ నిర్వహణ ప్రధానాలయం ప్రసాదాల విగ్రే కేంద్రం అన్న ప్రసాద వితరణ పారిశుద్ధ్యం కళ్యాణ్ ఘట్ట భలే రహదారి పాతాళగంగ మొదలైన ప్రదేశాలను తరచుగా సీసీ కెమెరాలు పరిశీలించటం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతాపరంగా మరిన్ని పగడ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటామని కార్యనిర్వాహణాధికారి తెలిపారు.

Leave a Reply