అవినీతికి అలవాటుపడిన వాళ్లు ఏమైనా చేస్తారు: డిప్యూటీ సీఎం

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాకినాడ (Kakinada)లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం ఎంతోమంది మహానుభావుల త్యాగఫలమని గుర్తు చేసుకున్నారు. గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా..? వైకాపా పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవి. అవినీతికి అలవాటుపడిన వాళ్లు ఏమైనా చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

కూటమి ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ‘సూపర్ సిక్స్’ పథకాల అమలులో భాగంగా, ‘స్త్రీ శక్తి’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం మహిళల ఆర్థిక స్వేచ్ఛకు, భద్రతకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ, 2019 నుండి 2024 వరకు జరిగిన పాలనను బ్రిటిష్ పాలనతో పోల్చారు. ఆ సమయంలో ప్రజల గొంతు నొక్కబడిందని, అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో నిజమైన ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను పునరుద్ధరిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు బలంగా ఉండాలని, పెట్టుబడులు రావడానికి ఇది అత్యంత అవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుల ‘ఓటు చోరీ’ ఆరోపణలను ఖండించారు. ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply