Andhra prabha | కథనానికి స్పందించిన అధికారులు..
Andhra prabha, నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో సర్పంచ్ స్థానం బీసీ జనరల్ రాగా ఈసారి దళితులకు ఉప సర్పంచ్ పదవి కేటాయించాలని కొంత మంది గ్రామ పెద్దలు అడగడంతో దళితులను అసభ్యకరంగా దూషించారు. దళితులువారి వారి కులవృత్తులకు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఇట్టి విషయంపై “ఆంధ్రప్రభ” దినపత్రికలో ప్రచురితం కాగా దళిత సంఘాల నాయకులు.. కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో సోమవారం ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలో దళితుల పై అగ్రవర్ణ కులాలు కుల వివక్ష చూపిస్తున్నారని ఫిర్యాదు రావడంతో గ్రామానికి రావడం జరిగిందన్నారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే గ్రామసభ ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలని.. అలాగే పారిశుద్ధ కార్మికులు గత మూడు రోజుల నుండి విధులకు హాజరు కావడం లేదని.. వారిని విధులకు హాజరయ్యేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ శ్రీనివాస్, ఎస్ ఐ రాజేష్, గ్రామ సర్పంచ్ బొమ్మెన మల్లేశం, కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

