కరీంనగర్ ఉమ్మడి జిల్లా బ్యూరో ఆంధ్రప్రభ నిషేధిత పొగాకు ఉత్పత్తులపై కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా చూపించారు. సోమవారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైన *గుట్కా విక్రయాలు ఆగేనా* అనే కథనానికి పోలీసులు స్పందించారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పొగాకు నిషేధిత ఉత్పత్తుల రవాణాపై దృష్టి సారించారు. బుధవారం తెల్లవారుజామున బీదర్ నుండి కరీంనగర్ కు వచ్చిన నిషేధి తప్పుగా ఉత్పత్తుల అంబర్ ప్యాకెట్ల డీసీఎం లోడును వల పన్ని పట్టుకున్నారు.

పోలీసుల దాడుల్లో సుమారు 70 లక్షల రూపాయల విలువ గల 300 బ్యాగుల్లో ఏడు లక్షల 50 వేల అంబార్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకం కోసం తెప్పించిన పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. అంబార్ లోడును గోదావరిఖనికి చెందిన వ్యాపారి బీదర్ నుండి తెప్పించి కరీంనగర్ వ్యాపారులకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు తెలిసింది.
