Andhra Prabha | అందరి పత్రిక ఆంధ్రప్రభ…

Andhra Prabha | అందరి పత్రిక ఆంధ్రప్రభ…

  • మంచి వార్తలతో సుస్తిర స్థానం
  • ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళారెడ్డి
  • నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ
  • పాల్గొన్న ఏఎంసీ చైర్మన్, నాయకులు

Andhra Prabha | తాండూరు, ఆంధ్రప్రభ : సమాజానికి ఉపయోగపడే వార్తలను అందిస్తూ ఆంధ్రప్రభ పత్రిక(Andhra Prabha Magazine) అందరి ఆదరణ చూరగొంటుందని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు తాండూరు పట్టణంలోని వారి నివాసంలో ఆంధ్రప్రభ దినపత్రిక నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌(2026 Calendar) ఆవిష్కరణ జరిగింది.

ఆర్బీఓఎల్ ఎండీ సరళా రెడ్డి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ జరగగా తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, వికాస్, దొరశెట్టి సత్యమూర్తి తదితరులు పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా సరళా రెడ్డి మాట్లాడుతూ.. వార్త రంగంలో ఆంధ్రప్రభ సాధిస్తున్న ప్రగతిని ప్రత్యేకంగా కొనియాడారు. ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా, కేవలం ప్రజా సమస్యలే ఎజెండాగా పని చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు లోకేష్‌, కార్యకర్తలు ఉన్నారు.

Andhra Prabha | దైవ సన్నిధిలో…

Andhra Prabha |

తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లోని శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆంధ్రప్రభ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి(Pattolla Bal Reddy), మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిల చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

అదేవిధంగా అంతారం మాజీ సర్పంచ్ రాములు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి(Shobharani), దేవాలయాల మాజీ చైర్మన్లు కుంచెం మరళీధర్, తర్లపల్లి భానుకుమార్, కోట్రిక నాగరాజు, కోట్రిక కిరణ్‌, చెన్నారం అనిల్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు, సంజీవరావు, ఆంధ్రప్రభ ప్రతినిధులు మహేష్‌, కె.శాంతు తదితరులు పాల్గొన్నారు.

Andhra Prabha |
Andhra Prabha |

CLICK HERE TO READ MORE సెంటిమెంట్ కలిసొచ్చేనా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply