Andhra Prabha | పేద ప్రజలకు అండగా… ఆంధ్రప్రభ

Andhra Prabha | పేద ప్రజలకు అండగా… ఆంధ్రప్రభ

  • క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి

Andhra Prabha | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రభ… నేటి వరకు పేద ప్రజలకు అండగా ఉంటూ విజయాలను నిక్కచ్చిగా, నిర్భయంగా ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నదని హసన్ పర్తి మండల విద్యాశాఖ అధికారి అంబటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల విద్యా వనరుల కేంద్రంలో స్థానిక విలేకరి వేల్పుల ఓదేలు ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ 2026 క్యాలెండర్ ను శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

పత్రికా రంగంలో నూతన ఒరవడితో ముందు సాగుతున్నదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలకు. అధికారులకు. ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న పత్రిక.. ఆంధ్రప్రభ అని కొనియాడారు. గత 87 వసంతాల సుదీర్ఘ అనుభవం గల ఆంధ్రప్రభ ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.

పత్రికలు సమాజానికి అద్దం పడతాయని.. ఆంధ్రప్రభ తనదైన శైలిలో వార్తలు రాస్తూ.. ప్రజల విశ్వసాన్ని పొందడం సంతోషకరమని అన్నారు.కాలానుగుణంగా ఆంధ్రఫ్రభ వెబ్, స్మార్ట్ ఎడిషన్, డీజిటల్ తో తాజా వార్తలు అందిస్తూ ముందుకు దూసుకెళుతున్నదని వివరించారు. 2026లో సైతం మరింత నూతన టెక్నాలజీతో మరెన్నో విజయాలు సాధించడంతో పాటు సంచలనాత్మక కథనాలకు దిక్చూచిగా నిలవాలని కోరారు.

Leave a Reply