అటు ఆఫీసర్ల నిత్య పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రిపై ప్రశాంత వాతావరణం
- జై భవానీ..జైజై భవానీ నినాదాలు
విజయవాడ, ఆంధ్రప్రభ : నవరాత్రి ఉత్సవాలు(Navratri celebrations) నాలుగవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు నుంచి క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది. నాలుగవ రోజు గురువారం శ్రీ కాత్యాయనీ దేవి(Sri Katyayani Devi) అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి(Indrakiladri) పర్వతానికి చేరుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న “స్త్రీ శక్తి” పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియల్ టైం డేటా(Real Time Data) ఆధారంగా ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుండటంతో పాటు భక్తులకు అవసరమైన కనీస అవసరాలతో పాటు మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ(Dr. G. Lakshmisha), జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి(Sri Durga Malleswara Swamy) వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలు అన్ని దశల్లోనూ భక్తుల అవసరాలను గమనిస్తున్నారు.
ప్రధానంగా క్యూలైన్లలో(Qlines)ని సాధారణ భక్తులకు మంచినీరు, పాలు పంపిణీతో పాటు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నసమయంలో అవసరమైన వైద్య సహాయం వంటి అంశాలతో సహా దర్శనానంతరం లడ్డు విక్రయ కేంద్రాలు, అన్న ప్రసాద స్వీకరణ కేంద్రాలలో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారుల(Officials)ను ఆదేశిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో అమ్మవారికి సేవ చేస్తున్నామనే భక్తి భావంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు తమ తమ విభాగాలకు చెందిన సిబ్బందిని ఆదేశ