ఇక ఆన్లైన్ మొక్కులు చెల్లించుకోవచ్చు!
తాడ్వాయి ( ములుగు జిల్లా), ఆంధ్రప్రభ : మేడారం(Medaram)లోని హుండీలో దక్షిణ వేయడం కోసం ఆలయ అధికారులు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. మేడారంలోని వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ(Sammakka, Saralamma) అమ్మవార్లకు దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మరికొన్ని నెలల్లో జరిగే జాతరకు లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన భక్తులు(devotees) ఆలయ అభివృద్ధి, అమ్మవార్లకు దక్షిణగా డబ్బులు వేయడం ఆనవాయితీ.
ప్రస్తుతం డిజిటిల్(Digital) విధానం అమలు కావడంతో చాలా మంది తమ జేబులో నోట్లు అతి తక్కువగా ఉంచుకుంటున్నారు. దర్శనం తర్వాత కానుకలు వేసేందుకు నోట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. క్యూఆర్ కోడ్(QR Code) స్కానర్ల ద్వారా హుండీ ఆదాయం పెంచుకోవడం కోసం అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తాడ్వాయి కెనరా బ్యాంకు(Canara Bank) సాయంతో మేడారం ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు వీటిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ఆవిష్కరించారు.