Anaganaga oka Raju | నవీన్ పోలిశెట్టి అతి చేస్తున్నాడా…?

Anaganaga oka Raju | నవీన్ పోలిశెట్టి అతి చేస్తున్నాడా…?
Anaganaga oka Raju | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో వస్తున్నాడు. తన గత చిత్రాల్లాగే ఈ సినిమానూ ఒక్కడే ప్రమోట్ చేసుకుంటున్నాడు. సహజంగానే నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తన సినిమాల విషయంలో అతి చేస్తుంటాడనే ఇంప్రెషన్ అందరిలో కలుగుతుంటుంది. దీనికి కారణం తన సినిమాకు అన్నీ తానే అన్నట్లుగా ఈ హీరో వ్యవహరిస్తుంచడమే. ఇప్పుడీ కొత్త చిత్రానికీ అదే కంటిన్యూ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ నవీన్ గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్నది ఏంటి…?

Anaganaga oka Raju | జాతిరత్నాలు హిట్ తో
జాతిరత్నాలు హిట్ తో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. లాక్ డౌన్ లో (LockDown) ఆ సినిమా రిలీజ్ కావడం నవీన్ బ్యాడ్ లక్..అయితే అంత లాక్ డౌన్ లోనూ కలెక్షన్స్ బాగా రావడం అతని గుడ్ లక్ అనుకోవాలి. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసి తెలుగు స్టేట్స్ లోనే కాదు అమెరికాలోనూ ప్రమోట్ చేసుకున్నాడు. ఆ ప్రమోషన్ వల్లే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రేక్షకుల్లోకి వెళ్లింది, డీసెంట్ హిట్ గా నిలిచింది.

Anaganaga oka Raju |ఓ సందర్భంలో నవీన్ పోలిశెట్టి
ఇదంతా ఓకే గానీ ఈ ప్రాసెస్ లోనే నవీన్ పోలిశెట్టి చాలా అతి చేస్తుంటాడని ఆయనతో వర్క్ చేసిన టీమ్ మెంబర్స్ చెబుతుంటారు. తనకు ఒక్కడికే ఆ సినిమా మీద లవ్ ఉన్నట్లు అర్థరాత్రి అపరాత్రి లేకుండా యూనిట్ మెంబర్స్ కు కాల్స్ చేసి సినిమా పనుల గురించి అడగటం, సినిమాను ఇంకా బెటర్ చేయాలని వేధించడం వంటివి చేస్తుంటాడట. దాంతో యూనిట్ (Unit) మెంబర్స్ అతని ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయడం మానేస్తుంటారని టాక్. ఓ సందర్భంలో నవీన్ పోలిశెట్టి ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకున్నాడు. సినిమాకు కావాల్సిన వర్క్ ఎవరి బాధ్యతగా ఆ యూనిట్ మెంబర్ చేస్తుంటాడు అయినా ఈ వెంటపడి వేధిస్తేనే రావాల్సిన ఔట్ పుట్ కూడా క్వాలిటీగా రాకుండా పోతుంది. పైగా ఒక డిపార్ట్ మెంట్ లో ఒకరితో మాట్లాడి, క్రాస్ చెక్ చేసుకునేందుకు మరొకరికి టచ్ లోకి వెళ్తాడట ఈ హీరో. దాంతో తమ మీద నమ్మకం లేదా ఈయనకు అని ఫీల్ అవుతున్నారట సదరు టెక్నీషియన్స్. తనకు హిట్ పడాలని ఇంత గేమ్ ఆడాల్సిన పని లేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
అనగనగా ఒక రాజు సినిమా గతేడాదే రిలీజ్ కావాలి. ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా (Movie) డైరెక్షన్ కూడా తానే చేసుకున్నట్లు ఉన్నాడు అందుకే మారి అనే ఒక డైరెక్టర్ పేరు పోస్టర్ లో వేసినా అతనెవరో కూడా బయటకు రావడం లేదు. నవీన్ పోలిశెట్టి వ్యవహార శైలితో నిర్మాత నాగవంశీ కూడా విసిగిపోయినట్లు ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీమ్ మెంబర్స్ తో అతనికేం కావాలో చేయండబ్బా అని నాగవంశీ అన్నాడని తెలుస్తోంది. ఇది నిజమా లేక గాసిప్పా అనేది తెలియదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఆ నోటా ఈ నోటా నవీన్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని టాక్.

