స్వీపర్ శాహీన్ సుల్తాన బదిలీ.. ఘనంగా సన్మానం

స్వీపర్ శాహీన్ సుల్తాన బదిలీ.. ఘనంగా సన్మానం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని ఎన్‌పీడీసీఎల్ డివిజన్ కార్యాల యంలో సుదీర్ఘకాలం స్వీపర్‌గా విధులు నిర్వహించిన శాహీన్ సుల్తాన హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఏఏఓ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యాలయం లో డీఈ (ఆపరేషన్) ఘన్‌పూర్ బి. సారయ్య సమక్షంలో కార్యాలయ సిబ్బంది బదిలీపై వెళ్తున్న శాహీన్ సుల్తానను శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు ఎక్కడికి వెళ్లినా గౌరవం తప్పదన్నారు డీఈ సారయ్య.

ఉమ్మ డి వరంగల్ జిల్లా విభజన సమయంలో సీనియర్ విద్యుత్ ఉద్యోగు లకు వారి స్వంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కల్పించబడిందనన్నారు. అయితే అప్పట్లో విభజనకు నోచుకోని నాలుగవ తరగతి ఉద్యోగులకు యాజమాన్యం ప్రస్తుతం అనుమతి ఇచ్చిందన్నారు. అందులో భాగం గానే శాహీన్ సుల్తానకు వారి స్వంత ప్రాంతానికి వెళ్లే అవకాశం లభిం చిందని తెలిపారు. తాను 2003లో ఉమ్మడి జనగాం డివిజన్‌లో జన గాం టౌన్ ఏఈగా పనిచేసినప్పటి నుంచే శాహీన్ సబ్‌డివిజన్‌లో స్వీపర్‌ గా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఆమె విధుల పట్ల ఎప్పుడూ అలస త్వం ప్రదర్శించలేదని, డ్యూటీలో సెలవు పెట్టిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని ఆమె సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమం లో ఏఈలు రవీందర్, శ్వేతా, జేఏఓలు నర్సింహారెడ్డి, వీరస్వామి, సీనియర్ అసిస్టెంట్ బి. రాజ్‌కుమార్, లక్ష్మీ, సుకేష్, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, రమణాచారి, చిక్కుడు సతీష్, రజిత, తారామణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply