మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు

మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు
వీవర్స్ కాలనీ అభివృద్ధికి కృషి చేయండి
వార్డు కౌన్సిలర్ వంగ ఉమా యుగేందర్
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ: జనగామ మున్సిపల్ 12వ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాసులును వార్డు కౌన్సిలర్ వంగ ఉమా యుగేందర్ కోరారు. బుధవారం 12 వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి చైర్ పర్సన్ ను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాలు కాలంలో రివర్స్ కాలనీ వెనుకబడిపోయిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వివిధ అభివృద్ధి పనులకు సహకరించాలని చైర్ పర్సన్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో 12 వ వార్డ్ కౌన్సిలర్ వంగ ఉమా యుగేందర్ తో పాటు నాయకులు శ్రీరాం శ్రీనివాస్,బొంతపల్లి నాగరాజు,ఎనగందుల వెంకటేష్,రచ్చ సత్యనారాయణ, కాముని సమ్మయ్య, సురారం రాజు, దోర్నాల యాదగిరి,గూడెల్లి సత్యనారాయణ,కొండ శ్రీనివాస్, భేటీ రాజు, బిట్ల చిన్న, చైతన్య, వంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
