కౌన్సిలర్ లావణ్య రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు

కౌన్సిలర్ లావణ్య రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు

లావణ్య సురేందర్ రెడ్డి కౌన్సిలర్ గా బాధ్యతలు స్వీకరణ, సన్మానం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా
కౌన్సిలర్ లావణ్య సురేందర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం 3వ వార్డులో కౌన్సిలర్గా విజయం సాధించిన పల్లె లావణ్య సురేందర్ రెడ్డి ఆదివారం వార్డు కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. కౌన్సిలర్ లావణ్య సురేందర్ రెడ్డిని అభినందిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, వార్డు ఎన్నికల ఇన్చార్జి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెల్గ రాజశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు బి.ఎన్.రెడ్డి, మాజీ సర్పంచ్ లు గుండు మల్లయ్య గౌడ్, నరసింహ, 19వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను, నాయకులు బత్తుల విప్లవ్ కుమార్, సాయిలు, తొర్పునూరి శ్రీకాంత్, పర్నె శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply