ప్రభుత్వ విప్ వీరేశంను సన్మానించిన సర్పంచుల ఫోరం

ప్రభుత్వ విప్ వీరేశంను సన్మానించిన సర్పంచుల ఫోరం

చిట్యాల, ఆంధ్రప్రభ : క్రమశిక్షణకు నిబంధనకు పట్టుదలకు ప్రజాసేవకు మారుపేరుకు నిదర్శనం అయినందుకే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి ఎమ్మెల్యే వేముల వీరేశం కు ప్రభుత్వ విప్ వరించిందని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం తెలిపారు. శనివారం నాడు ఎమ్మెల్యేకు ప్రభుత్వ విప్ హోదా రావడంతో చిట్యాల మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి పూల బోకే అందించి శాలువాలతో సన్మానించి విడివిడిగా సర్పంచులు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య యాదవ్, ఆవుల సుందర్ యాదవ్, సాగర్ల యాదమ్మ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply