పెద్దన్న కోపం.. భారత్ మౌనం… కారణాలివేనా?

రెండోసారి అమెరికా (America) లో అధికారంలోకొచ్చిన ట్రంప్ చిత్రాతి చిత్రమైన చేష్టలకు సాక్షాత్తూ అమెరికన్లే విస్తుపోతున్నారు. ఇలాంటి అధ్యక్షుడినా మేము ఎన్నుకున్నది అని పశ్చాత్తాప పడుతున్నారు. రోడ్లెక్కి నిరసనలు (protests) వ్యకపరుస్తున్నారు. అయినా ట్రంప్ లో ఏమాత్రం స్వీయ సమీక్ష స్పృహ రావడం లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు తన ధోరణి తనదేనన్నట్టు తన ప్రజలనే కాక ప్రపంచ దేశాలనూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయినా ఇంకా ఎవరెవరిమీదనో తీవ్రమైన అసహనంతో ఊగిపోతున్నారు. ఒకప్పటి మిత్రులందరినీ శత్రువులుగా మార్చుకుంటూ పోతున్నారు.

ఒకవైపు భారత్ (India) మిత్ర దేశం అంటూనే, మోడీ తన మిత్రుడంటూనే మరోవైపు సుంకాలతో భారత్ పై విరుచుకు పడుతున్నారు. భారత్ రష్యాతో స్నేహంగా ఉండడం, భారత్-రష్యా (India-Russia) ల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగా ఉండడం ట్రంప్ కి ససేమిరా నచ్చడం లేదు. తన హెచ్చరికలను భారత్ లైట్ తీసుకోవడం పెద్దన్న జీర్ణించుకోలేకపోతున్నారు…

అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) బెదిరింపులకు లొంగకపోవడం ట్రంప్‌నకు మరింత ఆగ్రహం కలిగించింది. దీంతో, ట్రంప్ ప్రభుత్వం భారత్ ఉత్పత్తులపై సుంకాలను పెంచుతూ పోయింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. ఈ వాణిజ్య యుద్ధం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికాలోని ట్రేడ్ యూనియన్లు (Trade unions), వ్యాపార సంస్థలు (Business organizations) కూడా ఈ చర్యలను వ్యతిరేకించాయి. ట్రంప్ అనుసరించిన ఈ విధానాలు కేవలం రాజకీయ ప్రతీకార చర్యలే తప్ప, ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ సంబంధాలను కూడా దెబ్బతీసింది.

భారత్ పై ట్రంప్ టారిఫ్స్ బాదుడుకు రష్యా ఆయిల్ కొనుగోలు ఒక్కటే కారణం కాదని నిపుణులు భావిస్తున్నారు. భారత్-చైనా (India-China) మధ్య దౌత్య సంబంధాలు మెరుగవ్వడమూ కారణం కావొచ్చు అంటున్నారు. 2019 తర్వాత మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు. BRICS దేశాలన్నీ ఒక తాటిపైకొస్తే యూఎస్ డాలర్ కు ముప్పు తప్పదని ట్రంప్ భయపడుతున్నారు. ఆ అక్కసుతోనే భారత్ ఎకానమీని దెబ్బకొట్టాలని ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు భావిస్తున్నారు.

భారత్ పై అక్కసుతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) అదనపు టారిఫ్ వేసి మరోసారి ఉక్రోషాన్ని చూపించారు. 25% అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన మన దేశంపై 25% సుంకాలు మోపారు. దీనికి అదనంగా సుంకాలు ఉంటాయని ఇటీవల ప్రకటించారు. ఈక్రమంలోనే మరో 25% విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.


మిత్ర దేశం (friendly country) అంటూనే భారత్ పై ట్రంప్ టారిఫ్స్ యుద్ధం ప్రకటించారు. ఇష్టారీతిన సుంకాల (50%)తో విరుచుకుపడుతున్నారు. భవిష్యత్తులో నూ ఇంకా పెంచుతానని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్(50%), భారత్ మాత్రమే అత్యధిక టారిఫ్స్ ఎదుర్కొంటున్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్ (39%), కెనడా(35%), చైనా(30%) ఉన్నాయి. ట్రంప్ చర్యలతో యూఎస్ ఊశ్, భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

యూఎస్ 50% టారిఫ్స్ విధించడంతో ఆ దేశంలో భారతీయ వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో భారత్ లో వస్త్రాలు, చెప్పులు, లెదర్, కెమికల్స్, జువెల్లరీ, సీ ఫుడ్ తదితర రంగాలు భారీగా నష్టపోతాయని నిపుణులు (Experts) చెబుతున్నారు. ఎగుమతులు 40-50% తగ్గొచ్చని అంటున్నారు. కాగా ట్రంప్ జులై 31న ప్రకటించిన మొదటి రౌండ్ సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నిన్న విధించిన అదనపు 25% టారిఫ్స్ ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి.


సుంకాన్ని 50శాతానికి పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ స్పందించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) (ఎంఈఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ట్రంప్ తీసుకున్న‌ నిర్ణయం అనుచితం, అన్యాయం, అసమంజసమని అభివర్ణించింది. భారత దిగుమతులు (Indian imports) మార్కెట్ ఆధారంగా జరుగుతాయని, దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత లక్ష్యంతో చేశామని, దీనిపై ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేశామని పేర్కొంది. అలాగే, ఇతర దేశాలు తమ సొంత జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యల తరహాలోనే భారత నిర్ణయాలపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా ఎంచుకోవడం చాలా దురదృష్టకరమని తెలిపింది.


ఇదిలా ఉండ‌గా.. రష్యాతో సంబంధాలపై ట్రంప్ హెచ్చరిస్తున్నా భారత్ వాటిని పట్టించుకోవడం లేదు. ట్రంప్ వార్నింగ్స్ (Trump warnings) నేపథ్యంలోనే రష్యాతో కీలక ప్రొటోకాల్ డీల్ (Protocol deal) కుదుర్చుకుంది. బుధవారం ఢిల్లీలో జరిగిన 11వ మాడర్నెజేషన్ అండ్ కోఆ పరేషన్ వర్కింగ్ గ్రూప్ సెషన్ సందర్భంగా అల్యూమినియం, ఎరువులు, రైల్వేలు, మైనింగ్ టెక్నాలజీ (Mining Technology) వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి ప్రోటోకాల్ డీల్ పై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ సమావేశానికి డీపీఐఐటీ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా, రష్యా మంత్రి అలెక్సీ గ్రుజవ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్ప టికీ భారత్ రష్యాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం.

Leave a Reply