America Road accident | తెలుగు దంపతుల మృతి
America Road accident | యలమంచిలి, ఆంధ్రప్రభ : అమెరికా (America) లో దారుణ రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లు కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. వాషింగ్టన్ (Washington) లో జరిగిన కారు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు కొటికలపూడి కృష్ణ కిషోర్ (Krishna Kishore) (45), ఆశ (asha) (40) ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు తీవ్ర గాయాలతో పోరాడుతున్న నేపథ్యంలో ఈ ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పది రోజుల క్రితమే స్వగ్రామం పాలకొల్లుకు వచ్చి వెళ్లిన ఈ దంపతుల మరణం మరింత విషాదాన్ని నింపింది.

