America | ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం

America | ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం

America | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా విమానం సుమారు 680 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వెనుదిరిగి మేరీల్యాండ్‌లోని బేస్ ఆండ్రూస్ వద్ద సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ ఘటనతో ట్రంప్ పర్యటనలో ఆలస్యం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. విమానంలో స్మాల్ ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చిందని, అందుకే యూ టర్న్ తీసుకున్నట్లు తెలిపారు. వైట్ హౌస్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ సమస్యను విమానం టేకాఫ్ చేసిన కొద్దిసేపటి తర్వాత గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే ట్రంప్ మరో విమానంలో దావోస్ పర్యటనకు బయల్దేరినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.

Leave a Reply