అరసవిల్లిలో అద్బుత సన్నివేశం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ భ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి(Arasavilli)లోని సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్(A.R. Damodar) దంపతులు, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.మహేశ్వర్ రెడ్డి(K. Maheshwar Reddy) దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ(Ippili Shankara Sharma), ఆలయ పర్యవేక్షకులు వెంకట రమణ, జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి(Chakravarthy) ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితలు ఆశీర్వదించారు. ఇద్దరు ఎస్పీలకు స్వామి ప్రసాదాలను, చిత్రపటం(portrait) సిబ్బంది అందజేశారు.