భక్తిశ్రద్ధలతో అమరేశ్వరుని గ్రామోత్సవం

భక్తిశ్రద్ధలతో అమరేశ్వరుని గ్రామోత్సవం

అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ) : పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరుని గ్రామోత్సవం ఇవాళ‌ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించుకున్న బాల చాముండికా సమేత అమరేశ్వరుడు నంది, చిలుక, రథం వాహనాలపై గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. నూతన దంపతులైన బాల చాముండికా సమేత అమరేశ్వరునికి భక్తులు విరివిగా హాజరై కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

గ్రామోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విరివిగా హాజర‌య్యారు. నవ దంపతులు ఆలయం నుండి క్రోసూరు రోడ్డు జంక్షన్ వరకు ఊరేగింపుగా వచ్చి వెనుతిరిగి ఆలయంలోకి వెళ్లారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో అమరేశ్వరుని గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి కర్రెద్దుల రేఖ, పాలకమండలి సభ్యులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు రధాన్ని లాగి ఊరేగింపులో పాల్గొన్నారు.

Leave a Reply