Amaravati – నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

అమరావతి – ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది.. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది పొలిట్‌బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది.. మూడు సార్లుకు మించి పార్టీ పదవులు ఉండకూడదన్నారు మంత్రి లోకేష్.. గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు మార్పులు ఉండాలని పేర్కొన్నారు..

దీంతో లోకేష్ టీమ్‌ రెడీ అవుతుందనే చర్చ స్టార్ట్ అయింది.. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంలో ఈ దిశగా నేతలకు చెప్తారా..? పొలిట్‌బ్యూరోలో మార్పులు ప్రస్తావిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.. కాగా, కూటమి ప్రభుత్వంలో.. గతంలో మంత్రులుగా పనిచేసినవారిని, సీనియర్‌ నేతలను సైతం పక్కనబెట్టి.. యువ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు.. అయితే, పార్టీ పదవులుల్లో కొందరు సీనియర్‌ నేతలు ఉన్నారు.. లోకేష్‌ వ్యాఖ్యలతో ఆ సీనియర్లకు కూడా రెస్ట్‌ ఇస్తారా? అనే చర్చ సాగుతోంది.

Leave a Reply