పూర్వ విద్యార్థుల సమావేశంలో…

పూర్వ విద్యార్థుల సమావేశంలో…

దేవరకొండ, అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ): నాడు అందించిన విద్యతోనే నేడు కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశంలో ఎమ్మెల్యేగా మాట్లాతున్నానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 1969 నుండి నేటి వరకు చదువుకున్న విద్యార్థుల హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను కూడా ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. ఈ కళాశాలలో ఎంతోమంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలు చేరుకుని పలువురికి సేవలందించిన మహాభావులున్నారని బాలు నాయక్ అన్నారు.

కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల కమిటీ సహకారంతో చేపట్టే పనులకు తాను కూడా అండగా ఉంటానని బాలు నాయక్ అన్నారు. గత 50 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన వార్ని కూడా ఈ సమావేశాల్లో కలవడం సంతోషంగా ఉందని బాలు నాయక్ అన్నారు. ఈ సమావేశంలో శ్రీశైలం దేవాలయ కమిటీ సభ్యులు చిలువేరు కాశీనాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ ఎంపీపీ బాల నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమునా మాధవరెడ్డి, రాములు చౌహన్, లాలూ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ సుంకరి రమేష్ తదితర పూర్వ విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply