నంద్యాల బ్యూరో – ఆంధ్రప్రభ – నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని చాగలమర్రి సమీపంలో ఉన్న ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను శనివారం అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి కోలికపూడి ప్రమోద్ శనివారం తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు చాగలమర్రి మండలం మల్లె వేముల రస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న ఐపిఎల్ బెట్టింగ్ ముఠా నిందితులను కనుగొన్నమన్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో బెట్టింగ్ ఆడుతున్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి నిందితులను మహమ్మద్ రఫీ, మద్దిలేటి రెడ్డి, బాబా ఫక్రుద్దీన్, సాకలి హరికృష్ణ, షేక్ షరీఫ్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న మ్యాచ్పై బెట్టింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.బెట్టింగ్ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నారని వారి నుంచి రూ.2.6 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్ ఆడేవారు ఫిజికల్గా కానీ యాప్స్ ద్వారా గాని వెబ్సైట్ ద్వారా గాని ఆడినప్పటికీ, ఐ పి డిలీట్ చేసినప్పటికీమా కున్న సాంకేతిక సమాచారంతో నిందితులను పట్టుకోగలమని తెలిపారు. ఐదు మంది బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్ లో సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్ఐ సురేష్ లు కీలక పాత్ర పోషించారని తెలిపారు.జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఐపీఎల్ బెట్టింగ్ ఆటలాడుతూ బెట్టింగ్ కు పాల్పడితేను అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు