- పూర్తిగా ఏసీ సదుపాయం
ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం నుండి కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఇటీవల ప్రారంభించిన నూతన ఎయిర్ కండిషన్డ్ పూజా మండపానికి మార్చడం జరిగింది. లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రార్చన, అన్నప్రాసన వంటి సేవలు ఇకపై నూతన పూజా మండపంలో భక్తులకు అందుబాటులో ఉంటాయి…
అలాగే, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా నిష్క్రమణ మార్గం వద్ద వేద ఆశీర్వచనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా కొనసాగనుంది. వారం తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోబడుతుంది.భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ అధికారులకు సహకరించాలని తెలిపారు.

