CT 2025 | టాస్ గెలిచిన కివీస్ – బ్యాటింగ్ చేయనున్న టీమిండియా

దుబాయ్ – ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది.. ఇక ఇండియా టీమ్ లో ఒకేఒక మార్పు చేసారు. హర్షిత్ రాణా ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి వచ్చాడు.

కాగా, ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇరు జట్లకి ఇది నామమాత్రపు మ్యాచ్. అయితే, దుబాయ్ వేదికగా నేటి మధ్యాహ్నం 2.30కి జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించి… గ్రూప్ దశ ను టేబుల్ టాపర్గా ముగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో భారత్–న్యూజిలాండ్ జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

అయితే ఈ మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్ అయినపట్టికీ.. సెమీఫైనల్‌లో ఏ జట్టు ఎవరితో తలపడాలనేది ఈ మ్యాచ్‌లో తేలనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. బలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉండటంతో పాటు వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్నాయి. దాంతో ఆ పోరు ఆసక్తికరంగా సాగనుంది.

కాగా, ఈరోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన కివీస్‌పై గెలిస్తే.. సెమీఫైనల్ 1లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. సెమీఫైనల్ 2లో సౌతాఫ్రికా vs న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డతాయి,

నేటి మ్యాచ్‌లో భారత జట్టుపై న్యూజిలాండ్ జట్టు గెలిస్తే… సెమీఫైనల్ 1లో టీమిండియా-దక్షిణాఫ్రికా… సెమీఫైనల్ 2లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

రెండు జట్లూ ఒక్కో మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాయి..

టీమిండియా : హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ వచ్చాడు.

తుది జ‌ట్లు

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేల్ రాహుల్ (వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి

న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీప‌ర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓ’రూర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *