దారులన్నీఇంద్రకీలాద్రి వైపే…

  • వైభవంగా కొనసాగుతున్నశరన్నవరాత్రి ఉత్సవాలు
  • రెండవ రోజు గాయత్రీ దేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం
  • అమ్మ అనుగ్రహం కోసం భక్తుల ఎదురుచూపు…
  • మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి సుమారు 42 వేల మంది భక్తుల రాక…
  • అమ్మ దర్శనానికి గంటన్నరపైగా సమయం…
  • రోజురోజుకీ పెరుగుతున్న వీఐపీల తాకిడి..
  • ఉదయం 4 గంటల నుండి అమ్మ దర్శన భాగ్యం..
  • ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న సిపి, కలెక్టర్, ఈవో…

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, సంధ్యా దేవత(Goddess of dusk)గా, వేదమాతగా పూజలందుకునేందుకు శ్రీ కనకదుర్గమ్మతల్లి శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముక్తి ఇదుమాలీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తున్న గాయత్రీ మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి(Malleswara Swami) వార్ల దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజు మంగళవారం, 23 సెప్టెంబర్ 2025 న కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు సాక్షాత్కరించారు. శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు(Lord Vishnu), శిఖలో రుద్రులతో ప్రకాశిస్తూ తేజోయమాయంగా విరాజిల్లుతున్న గాయత్రీ మాతను వీక్షించేందుకు రెండు కళ్ళు చాలడం లేదని దర్శించుకున్నభక్తులు తాదాత్మ్యంతో చెబుతున్నారు.

ఉదయం నాలుగు గంటల నుండి..

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, గాయత్రి మాత దేవి అలంకరణలో మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుండి భక్తులకు దర్శనం ఇచ్చారు. సర్వసుందరమైన అలంకరణ(decoration), ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పాహిమాం పంచముఖి అంటూ భక్తులు పవిత్ర కృష్ణా నది(Krishna River)లో పుణ్యస్నానాలు ఆచరించి వినాయకుడి గుడి వద్ద నుండి క్యూలైన్ల(Culines) ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దసరా సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో కనకదుర్గమ్మ దర్శనం కోసం బారులు తిరిగి వస్తున్న భక్తుల రాకతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

అమ్మ దర్శనానికి గంటన్నర సమయం

గాయత్రీ దేవి అలంకరణలో ఉన్నకనకదుర్గమ్మదర్శనానికి సుమారు గంటన్నర పైగా సమయం పడుతుంది. వినాయకుడి(Ganesha) గుడి దగ్గర నుండి ప్రారంభమవుతున్నక్యూలైన్లలో భక్తుల రాక గంటకు పెరుగుతుండడం, మధ్య మధ్యలో వీఐపీల(VIPs) తాకిడి, అమ్మవారికి నివేదన సమయం ఇలా అన్నికలిసి సామాన్య భక్తులకు సుమారు గంటన్నరపైగా అమ్మవారి దర్శన సమయం పడుతుంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి సుమారు 42 వేల మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ(Kanakadurgamma) వారిని సరస్వతి అలంకరణలు దర్శించుకున్నారు.

పెరుగుతున్న విఐపిల తాకిడి

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వీఐపీలు ఇంద్రకీలాద్రి(Indrakiladri)కి తరలివస్తున్నారు. విఐపి లకు ప్రత్యేక టైమ్స్ స్లాట్ కేటాయించినప్పటికీ దానితో సంబంధం లేకుండా వీఐపీలు అమ్మవారి దర్శనానికి వస్తుండడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్ననేపథ్యంలో మంగళవారం కనకదుర్గమ్మ వారిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలు, పలు కార్పొరేషన్ల చైర్మన్(Chairman of Corporations)లు, సిపి రాజశేఖర్ బాబు, ఎండోమెంట్ కమిషనర్ కే రామచంద్ర మోహన్ తో పాటు రాజకీయ సినీ రంగ ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు.

క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన

లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం చేసిన సకల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ డా.లక్ష్మీశ(Dr. Lakshmi)తో పాటు ఈవో శీనా నాయక్ మంగళవారం ఇంద్రకీలాద్రి కనకదుర్గ నగర్ తో పాటు పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందజేస్తున్నారు. మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్(Control) రూమ్ ద్వారా సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు సేవాదళ్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు భక్తులకు అవసరమైన మంచినీరు, పాలు బిస్కెట్లను పంపిణీ చేస్తున్నారు.

కొనసాగుతున్న ఆర్జిత సేవలు

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయంలోని మహా మండపం ఆరవ అంతస్తు వద్ద అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు(Kumkumarchanalu), శ్రీ చక్ర అర్చనతో పాటు యాగశాలలో చండీ హోమం వంటి పలు కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అన్ని ఆర్జిత సేవలకు ఎనలేని డిమాండ్ నెలకొని ఉంది.

Leave a Reply