కార్వేటినగరం గగ్గోలు….

  • అఖిలపక్షం నిరసన ర్యాలీ

కార్వేటి నగరం, ఆంధ్రప్రభ : కార్వేటి నగరం మండలాన్ని జిల్లాలో కలపాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్వేటినగరం పోలీస్ స్టేషన్ వద్ద నుంచి మండపం వీధి వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

గతంలో చంద్రబాబు నాయుడు పచ్చనేతగా కార్వేటి నగరానికి వచ్చినప్పుడు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని కనుక ఆ హామీని నెరవేర్చాలని అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కోరారు.

ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల టిడిపి పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్నాథం, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి వెంకట కృష్ణ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రాజు, కార్వేటినగరం ఎంపీపీ లతా, కార్వేటి నగరం గ్రామ సర్పంచ్ ధనుంజయ వర్మ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply