Aler | యువకుడిని నన్ను గెలిపించండి….

Aler | యువకుడిని నన్ను గెలిపించండి….
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి పాశికంటి సంపత్ అన్నారు. ఐదో వార్డులో మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించి వార్డులోని సమస్యలు పరిష్కరించడమే కాకుండా పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు పెన్షన్లను ఇప్పించి వార్డులోని ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని అలాగే అన్ని వేళలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనరల్ సెక్రెటరీ సుంకరి సృజన్ కుమార్ గౌడ్ సీనియర్ నాయకులు పంపరి లక్ష్మీనారాయణ, కుడికాల మురళి, ఎలగందుల రమేష్, పాశికంటి సిద్ధి లింగం, యువ నాయకులు వినీత్, వినయ్ సాయి పాల్గొన్నారు.
