catch| కళ్లు చెదిరేలా పట్టేశాడు..

catch| కళ్లు చెదిరేలా పట్టేశాడు..
సెమీఫైనల్లో అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్
బౌండరీ లైన్ వద్ద అద్భుత విన్యాసం
స్టన్నింగ్ క్యాచ్‌కు విల్ జాక్స్ షాక్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బ్యాటింగ్, బౌలింగ్‌యే కాదు.. క్యాచ్‌లు కూడా మ్యాచులను గెలిపిస్తాయని క్రికెట్ దిగ్గజాలు ప్రతీసారి చెబుతుంటారు. ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్‌లో అదే నిజమైంది. సెమీఫైనల్లో టామ్ బ్యాంటన్ను క్లీన్‌బౌల్డ్ చేసిన అక్షర్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో బిగ్ వికెట్ అందించాడు. టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అక్షర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు విల్ జాక్స్(35) షాక్ అయ్యాడు. అక్షర్ పట్టిన సూపర్ క్యాచ్‌కు నిరాశగా పెవిలియన్ చేరాడు.

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి విల్ జాక్స్(35) పెద్ద షాట్ ఆడగా.. పరుగెడుతూ వెళ్లిన అక్షర్ పటేల్ బంతిని అందుకున్నాడు. బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్‌కు తాకుతున్నట్టు గమనించిన అతడు.. అప్రమత్తమై బంతిని శివం దూబే వైపు విసిరాడు. దూబే కూల్‌గా బంతిని అందుకోవడంతో డేంజరస్ జాక్స్ ఔటయ్యాడు. అంత.. భారత డగౌట్, స్టేడియంలోని అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.
