AITUC District | కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి

AITUC District | కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి

  • ఏఐటీయూసీ జిల్లా గౌరవఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి
  • ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు డిమాండ్

AITUC District | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు డిమాండ్ చేశారు. జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఉదయం 6.30 గంటలకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్. నాగరాజు మాట్లాడుతూ నెల 22వ తేదీ దాటినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ సమయం కావడంతో కార్మికులు ఏమి తినాలి, కుటుంబాలను ఎలా పోషించాలి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ జోక్యం చేసుకుని క్రిస్మస్ పండగకు ముందు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన జరుగుతున్న సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్ అక్కడికి చేరుకుని కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. పండగలోపు ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో, యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకుని విధులకు హాజరయ్యారు.

AITUC District

ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు జయశంకర్, సుగుణ, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, రమణి, సుకన్య, సురేష్, చిత్రా, బుల్లెమ్మ, వినోద్ కుమార్, మునిరత్నం, రంజిత్, వినాయకమ్మ, సాయి, సామెల్, కస్తూరి, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు ఎస్. నాగరాజు డిమాండ్

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు డిమాండ్ చేశారు. జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఉదయం 6.30 గంటలకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్. నాగరాజు మాట్లాడుతూ నెల 22వ తేదీ దాటినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ సమయం కావడంతో కార్మికులు ఏమి తినాలి, కుటుంబాలను ఎలా పోషించాలి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ జోక్యం చేసుకుని క్రిస్మస్ పండగకు ముందు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన జరుగుతున్న సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్ అక్కడికి చేరుకుని కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. పండగలోపు ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో, యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకుని విధులకు హాజరయ్యారు.

ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు జయశంకర్, సుగుణ, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, రమణి, సుకన్య, సురేష్, చిత్రా, బుల్లెమ్మ, వినోద్ కుమార్, మునిరత్నం, రంజిత్, వినాయకమ్మ, సాయి, సామెల్, కస్తూరి, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply