COLLEGE | ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ
COLLEGE | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (College) ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ డాక్టర్ శ్రావ్య ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల పైన వివక్ష చూపించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రిన్సిపాల్ లక్ష్మి మాట్లాడుతూ.. మా కళాశాల వాలంటీర్ల ద్వారా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు, అధ్యాపకులు హిరణ్మయి, సాజిదా సుల్తానా, జ్యోతి, స్పందన వలంటీర్లు పాల్గొన్నారు

