AFG VS AUS | ఆసీస్ – ఆఫ్ఘాన్ పోరుకు వ‌రుణుడు ఆటంకం !

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా – ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న‌ కీలక మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడ‌గా, గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పుతున్నారు.

కాగా, ఆఫ్ఘాన్ నిర్ధేశించిన 274 ప‌రుగ‌ల ఛేద‌న‌లో ఉన్న ఆసీస్.. 12.5 ఓవ‌ర్ల‌కు వికెట్ న‌ష్టంతో 109 ప‌రుగులు బాదింది. ప్ర‌స్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగుల మీద ఉన్నారు. ఆసీస్ విజయానికి 37.1 ఓవర్లలో 165 పరుగులు అవసరం.

వర్షం కారణంగా ఆటను పునఃప్రారంభించకపోతే నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. మూడు పాయింట్లతో ఆఫ్ఘనిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Leave a Reply