జగన్మాతను దర్శించుకున్న అడ్వకేట్ జనరల్..

జగన్మాతను దర్శించుకున్న అడ్వకేట్ జనరల్..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సహాయ కమిషనర్ రంగారావు, సహాయ కార్యనిర్వాహక అధికారి బి.వి. వెంకటరెడ్డి ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు అమ్మవారి శేష వస్త్రం ప్రసాదాన్ని సమర్పించారు.
