Advice | సంయ‌మ‌నం పాటించండి – ఇరాన్ – ఇజ్రాయేల్ ల‌కు భార‌త్ హిత‌వు

న్యూ ఢిల్లీ – పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. దీనికి ప్ర‌తిగా ఇరాన్‌లో 100 కూడా డ్రోన్ల లో ఇజ్రాయేల్ పై ఎదురుదాడికి దిగింది.. ఈ నేప‌థ్యంలోనే భారత్.. ఇరు దేశాలకు కీలక సందేశం పంపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరింది. సాధ్యమైనంత మద్దతును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అన్ని పరిస్థితుల్ని గమనిస్తున్నామని.. అవసరమైతే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుకొస్తుందని ప్రకటించింది. ఏ సమస్యకైనా పరిష్కారం దౌత్య మార్గాలేనని తెలిపింది.

భార‌తీయులు.. అప్ర‌మ‌త్తంగా ఉండండి..

ఇక భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని.. అనవసర ప్రయాణాలు ఆపుకోవాలని భారత్ సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తం అయ్యాయి.

Leave a Reply