విద్యార్థుల‌కు స‌ల‌హాలు.. సూచ‌న‌లు..

విద్యార్థుల‌కు స‌ల‌హాలు.. సూచ‌న‌లు..

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను నేర్పించేందుకు ఈ రోజు బోధన కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathy) అన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్(Zilla Parishad) ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షించారు.

మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అలాగే 9వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి, ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్ బుక్(Note Book)లో రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకొని చదవాలని అన్నారు. శ్రద్ధ, అంకితభావంతో నేర్చుకోవాలని సూచించారు. బోధనా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత‌నిస్తూ కఠినమైన పాఠాల‌ పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్(Collector) పిల్లలకు కొన్ని సూచనలు చేశారు. కూరలు ఎక్కువగా తినాలని, ఆకుకూరలు, గుడ్లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయని విద్యార్థులను ప్రశ్నిస్తూ వారికి వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే కల్పించాలని విద్యాధికారిని ఆదేశించారు.

విద్యార్థులు(Students) చేతులు కడుక్కునే చోట నల్లాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు.

Leave a Reply